Wednesday, November 4, 2015

Sri Tadepalli raghava narayana Sastry gari sannidhi

                    బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రముఖ శ్రీవిద్యా ఉపాసకులు. వారి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని చందవోలు. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గార్ల ప్రవచనాలలో వారి గురించి విని వారు నివసించిన ఇంటిని దర్శించాలనే కోరిక బలంగా కలిగింది. ఇన్నాళ్ళకి అమ్మ వారి అనుగ్రహంగా ఆ అవకాశం దొరికింది.
                                                   
       కాకినాడ నుండి బెంగుళూరు వెళుతుండగా దారిలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ మోపిదేవి అనే సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచి చందవోలు గ్రామం చేరుకున్నాం. ఊరి మొదట్లోనే ఉన్న చందవోలు అనే బోర్డు ప్రక్కనే వారు నివసించిన ఇల్లు ఉంది. ఇంటి ప్రక్కనే వారి పేరు మీద ఉన్న వేద పాఠశాల కూడా ఉంది. ఊరిలోని వారికి చందోలు శాస్త్రి గారుగా వారు సుపరిచితులు.
                ఇంట్లోకి వెళుతూనే అమ్మవారి స్వరూపమైన ఒక నిండు ముత్తైదువ ఎదురొచ్చారు. వారు శ్రీ శాస్త్రి గారి కోడలు. మేము శాస్త్రి గారి ఇల్లు చూద్దామని వచ్చామని చెబితే ఆవిడ లోపలికి వెళ్ళి ఒకాయనను పిలిచారు. ఆయన శాస్త్రి గారి అబ్బాయట. వారి వయసు సుమారు 75-80 మధ్యలో ఉండి ఉండవచ్చు. వారు కూడా చూడగానే నమస్కరించాలనిపించేలా ఉన్నారు. మేము శాస్త్రి గారి గురించి విని ఆ ఇల్లు చూడాలని వచ్చామని చెప్పాక ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చున్నారు. మేము ఎక్కడి నుంచి వచ్చామో వివరాలు కనుక్కున్నారు. తరువాత సంభాషణ ఇలా జరిగింది:
మీరు శాస్త్రిగారి కుమారులాండీ?
అవును
వారి గురించి కొంచం చెబుతారా
మీరు ప్రవచనంలో వినలేదా?
కొడుకుగా మీ మాటల్లో విందామని అడిగాము.
కొంచం సేపు ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను "మాకు ఈ ఇల్లు చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది కానీ ఇన్నాళ్ళకి అమ్మవారి అనుగ్రహంగా కుదిరింది" అన్నాను. "మంచిది" అన్నారాయన.
మరలా కాసేపు మౌనంగానే ఉన్నారాయన. నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు.
అంతకు ముందే విన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం గుర్తుకు వచ్చి "వారు ప్రతిష్ఠించిన బాలాత్రిపుర సుందరీ అమ్మవారి మందిరం ఎక్కడ ఉందండీ" అని అడిగాను. "తెనాలిలో గంగానమ్మ గుడి దగ్గరలో ఉంది. వారు నిత్యం అనుష్ఠానం చేసుకున్న పీఠం మాత్రం ఇక్కడే ఉంది. దాని ఆరాధన ఇప్పుడు మేము చేసుకుంటున్నాము. ఈ ప్రక్కనే ఉంది. వెళ్ళి చూసి రావచ్చు" అన్నారు. వారు కొంచం ముభావంగా ఉండడంతో ఆ సమయంలో వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టామా అనే భావం కూడా రాకపోలేదు. సరే చూద్దాంలే అని ఆ అమ్మవారికే చెప్పుకుందాంలే అని లేచి ప్రక్కనే ఉన్న పూజా గది దగ్గరికి వెళ్ళాము. అక్కడ కొంతమంది పిల్లలు వేదం చదువుకుంటున్నారు. అక్కడి పీఠానికి నమస్కారం చేసుకుని కొన్ని ఫొటోలు తీసుకుని మళ్ళీ వీరి దగ్గరికి వచ్చాము. ఈ సారి మాట్లాడడం మొదలు పెట్టిన వారు సుమారు ఒక గంట సేపు చాలా హాయిగా మాట్లాడారు. మధ్యలో నేను, వారు వ్రాసిన పుస్తకాలు ఏమైనా దొరుకుతాయా అని అడిగితే ఒక 4 పుస్తకాలు అక్కడి అల్మరాలోంచి తీసి ఇచ్చారు. వారి మాటలను ఈ క్రింద పొందుపరుస్తున్నాను:
                     వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు. ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు. ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు. దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి. అన్ని దైవ శక్తులు ఎల్లప్పుడూ వారి అధీనంలో ఉండేవి. కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు. అమ్మవారు వారిని అనేక సార్లు "నీకు ఏమి కావాలో చెప్పు. ఐశ్వర్యం, చక్రవర్తిత్వం, దాసదాసీలు, ఏనుగులు, సంపదలు, కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో" అనేది. వారు "నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా" అనేవారు. పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు.
                               ఒక సారి యమ ధర్మరాజు వారి వద్దకు వచ్చి ధర్మం చెప్పమని అడిగారట. వారు యమునితో "మీరే ధర్మానికి అధిదేవత కదా!నేను మీకు ధర్మం చెప్పడమేమిటి?" అని విస్తుపోయారట. కానీ యముడు "నేను ధర్మంలో వచ్చిన సందేహాలను తీర్చుకోవడం కోసం ఎందరినో కలిసాను. శివుడు, విష్ణువు, దేవతలు అందరినీ కలిసాను కానీ మీరు చెప్పినదే అంతిమంగా అసలైన ధర్మమని మీ వద్దకు వచ్చాను" అన్నారు. వారు యమునితో "నేను ఏమి చెప్పినా శాస్త్రబద్ధంగానే చెబుతాను. నా స్వంత అభిప్రాయాలు ఏవీ చెప్పను. కనుక మీ సందేహాలను అడగండి" అని వారి సంశయాలన్నింటికీ శాస్త్ర ప్రకారం, వేద ప్రమాణంగానూ సమాధానాలను ఇచ్చారు. అంతటి స్థితి వారిది.
             వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. దాని అధ్యయనంలో భాగంగా వారికి ఒక మూలిక గురించి తెలిసింది. అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక. అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోని ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకుని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్ళారు. (వారు ఆ కొండ పేరు చెప్పారు కానీ నాకు గుర్తు లేదు) సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది. పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు. సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామనుకుంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు. అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తుండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరడం లేదు. ఇక విసిగిపోయిన వారు "ఎవడవురా నువ్వు? నాకెందుకు అడ్డు వస్తున్నావు? నన్ను ఆ మూలిక కోసుకోనీ. మరల గ్రహణం అయిపోతే అది కనిపించదు" అన్నారట. ఆ పిల్లవాడు "నేనెవరైతే నీకెందుకు? నీకు ఆ మూలిక ఎందుకు?" అని ప్రశ్నించాడు. "ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వమంతా వశమవుతుందట. కనుక నన్ను దానిని తీసుకోనీ" అని శాస్త్రి గారన్నారు. దానికి అ పిల్లవాడు నవ్వి "ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా" అన్నాడట. శాస్త్రి గారు "అదంతా నీకెందుకు? ముందు అడ్డు తొలగు. మరల గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది" అని కోరారు. కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఈ లోగా గ్రహణం పూర్తయిపోయింది, ఆ మూలిక మాయమైపోయింది. శాస్త్రి గారు నిట్టూరుస్తూ ఉండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు. కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయస్వామి.
                              వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒక సారి ఒక 6-7 యేళ్ళ పిల్లవాడు వీరిని చూచి "మనిద్దరం కలిసి ఫలానా కొండ మీద 20 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాం కదా! గుర్తు లేదా?" అని అడిగాడట. వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద, ఎప్పుడు, ఎవరు అని ఏదో అడుగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట. అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహా భాగ్యశాలియో కదా! 
            తెనాలిలో ఉండే చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు వీరికి, కంచి పరమాచార్యకు శిష్యులు. వీరు బ్రాహ్మీభూతులైన తరువాత ఒక సారి వారికి ఈ క్రింది స్వప్నం వచ్చిందట. శాస్త్రి గారు ఒక సారి నరక లోకం ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద బాణలిలో ఏదో బాగా కాగుతూండడం చూచారు. అదేమిటా అని తొంగి చూస్తే నూనె సల సల కాగుతుండగా ఎంతోమంది పాపులు దానిలో తమ పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు. అయ్యో అని వీరు దానిలోకి చూస్తుండగా వారి నుదుట ఉన్న బొట్టులోని చిన్న గంధం పిసరు అణు మాత్రం ఆ నూనెలో పడింది. వెంటనే సల సల కాగే ఆ నూనె చల్లబడిపోయి దానిలోని పాపులందరికీ పాప పరిహారమైపోయి వారంతా ఆనందంగా పైకి వచ్చేసారట. అది చూచి యమధర్మ రాజు కంగారు పడి, "ఎవరయ్యా ఆయనను ఇక్కడకు తీసుకు వచ్చింది? ఆయనను ఏ స్వర్గానికో తీసుకుపోవాలి కానీ ఇక్కడకు తీసుకు వస్తే ఇక ఇక్కడ మన పనేం కాను? వెంటనే వారిని ఇక్కడి నుంచి తీసుకుపోండి" అని ఆజ్ఞాపించారట. వారు ధరించిన అణుమాత్ర చందనానికే అంతటి పాపాన్ని పోగొట్టగలిగిన శక్తి వచ్చిందంటే, ఇక వారి శరీరమంతా అణువణువూ ఎంత తపశ్శక్తితో నిండి ఉండి ఉంటుందో కదా! 
           వీరి ధర్మ పత్ని గారు కూడా వీరితో ఈడు జోడైన తపస్సంపన్నులు. వీరు బ్రాహ్మీ భూతులవడానికి 5 సంవత్సరాల ముందే అంటే 1985 లో ఆవిడ స్వర్గస్తులయ్యారు. ఆవిడ కూడా ఎప్పుడూ భగవన్నామం వ్రాసుకుంటూ, పాటలు పాడుకుంటూ వీరి తపస్సుకు సహకరిస్తూ ఉండేవారు. ఆవిడే స్వయంగా కొన్ని పాటలు కూడా వ్రాసేవారట. 
           తల్లి గారి గురించి చెబుతుండగానే వారి అబ్బాయి ఇలా చెప్పారు" నేను వారి సోదరుని కుమారుడిని.  వారు నాకు పెదనాన్నగారు. కానీ నా 7వ యేట నుంచీ నేను వారితోనే ఉన్నాను. వారికి కొంతమంది సంతానం కలిగారు కానీ నష్టపోయారు. ఒక కుమార్తె మాత్రం ఉన్నారు" అని చెప్పారు.
       వారు మాతో ఇంకా ఇలా అన్నారు: "శాస్త్రిగారికి ఈ శక్తంతా వారి తపస్సు వల్ల వచ్చింది. అది ఒక్క జన్మలో సాధ్యమయ్యేది కాదు. ఎన్నో జన్మలు సాధన చేస్తే గానీ ఆ స్థితిని చేరుకోలేం. కనుకనే మనమందరం కూడా నిత్యం ఏదో ఒక రూపంలో తపస్సు అంటే భగవదారాధన చేస్తూనే ఉండాలి. అప్పుడే జన్మ సార్థకమవుతుంది. నిత్యం మనం ఏమి తింటున్నా అది భగవంతునికి అర్పించి తింటే అది మహా ప్రసాదమవుతుంది. పురుష ప్రయత్నంగా మన ధర్మం నెరవేరుస్తూ మన తపస్సు కొనసాగిస్తూ ఉంటే తప్పక భగవదనుగ్రహం కలిగి మంచి స్థితిని చేరుకోగలం.
              వారి మాటల ద్వారా వారు జ్యోతిష శాస్త్రంలో కూడా ప్రవీణులని అర్థమయ్యింది. తరువాత వారు మా కుటుంబం గురించి కొంత అడిగి, వారి భార్యను పిలిచి నాకు కుంకుమ ఇమ్మన్నారు. ఆవిడ నాకు బొట్టు, పండు ఇవ్వగా, మేము వారికిరువురికీ దూరం నుంచే నమస్కరించుకున్నాం. వారు మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. మనసంతా అంతులేని సంతోషంతో నింపుకుని మరల మరల ఆ పరిసరాలంతా చూస్తూ నమస్కరించుకుంటూ వెనుతిరిగి వచ్చాము.
      ఇంతటి అవకాశాన్ని ఇచ్చి అనుగ్రహించిన అమ్మవారి కృపకు జన్మంతా కృతజ్ఞులమై ఉండేటట్లుగా కూడా ఆ అమ్మవారే అనుగ్రహించాలని కోరుకుంటున్నాము.
    ఆ పరిసరాలలో తీసిన కొన్ని ఫొటోలు ఇక్కడ ఉంచడం ద్వారా మీరు కూడా ఆ సన్నిధిలో ఉన్న భావనను పొంది ఆనందంచగలరని ఆశిస్తున్నాను.
                        మమ్మల్ని అనుగ్రహించి ఆ మహాపురుషుని గురించి వివరించింది ఈ పుణ్య దంపతులే .

 వారు ఉపయోగించిన పడక కుర్చీ...దాని తపస్సేమో...ఆ మహా పురుషునికి అంతటి సేవ చేసుకోగలిగింది...వారి ఆసనమై తరించింది....
                         
                  

63 comments:

 1. Your curiosity & interest about Holy Guru Chandole Sastry Garu through pravachams has helped many people see his house, family, his rare holy photos, & temple in which his Shakti is imbibed. Thank You so much for having a pious thought of publishing these. Dhanyullam!!! Excellent, Marvellous job. Thank you again!

  ReplyDelete
 2. Our maternal grandfather Late Sriman Jammalamadaka Venkateshwara Sarma Garu was Guru garu's direct disciple, who could get the greatest opportunity to touch & wash the lotus feet of Guru & Amma at his own house at Bapatla. His punyam (positive deeds) has helped us to see & feel Balatripurasundari mata's house (Chandhole Sastry garu's house). Thanks to Guru, Thanks to my Grandfather, Thanks to you.

  ReplyDelete
  Replies
  1. sir, actually we are blessed to be directed by god to such holy place. you are also very much blessed to be in direct contact with such a great devotee of that great mahapurusha. if possible try to collect their experinces with that great soul and share us so that we all can feel His grace. Thank you sir

   Delete
  2. Madam, Can you please suggest how to reach Chandole from hyderabad. Thank you.

   Delete
 3. Chaala santosham, ammavari gudi unnadani vinatamay kaani, correct address ivalay telisindi. Dhanyavaadalu meeku. Meeru vaarito jaripina sambhashana pondaparichaaru chaala bavundi. Ayyagaari pustakaalalo ammavarito vaari sambhashanala oka pustakam unnadani vinnanu. Daani gurinchi nenu prayatnistunnanu. I want to know if you have any idea about it. You are indeed very fortunate to have the darshan of the abode of guruvugaaru. The pictures are really awesome and special thanks for presenting the conversations in this blog. Kindly if you know anything about the book let me know about it. Pranams Once again thank you for the pictures. i wish i have the darshan of such great mahan's abode.

  ReplyDelete
  Replies
  1. That's all just because of god's grace. I don't know in detail about the book, but he gave me some 4 books of Sri sastry garu. I have gone through one book only completely. I am yet to go through the others. Once I read them, I'll definitely let you know.

   Delete
  2. Hi Lalitha Sree garu, It nice to go through these things. I am trying and searching so hard to locate Tadepalli Sastry gari house. Once again thanks for share this Information. Once i will visit his home.
   It would be grateful if you can share the copy of 4 books from Tadepalli Sastry garu.

   Delete
  3. i only have the hard copies of the books. if i happen to get any soft copy, i'll definitely share it. May god shower His blessings on you and make you happy with the darshan of Chandole.

   Delete
  4. I found one book titled Yamavika here: https://archive.org/details/yamavika026401mbp.

   Can somebody please confirm if this is written by sastry garu ?

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. My Husband sri somanchi Ashok Kumar and I ( Padma Ramani) had the good fortune of going over to Chandolu and meeting sastry garu's son. we too spent nearly 2 hours and had listened to him. he has narrated the same incidents and reading this now, I had relived the experience. We have visited the temple in Tenali also. a very exhilarating experience. Felt truly blessed

   Delete
  7. very happy to hear that you had the oppurtuity to visit those holy places.

   Delete
 4. Very great deed. Ur blessed Soul so u got the rare chance of visiting the Divine place.Thanks for the Temple address

  ReplyDelete
 5. Mahapurushudu nadachina sthalam Ku velladam me adrustham meru tesina photos chudatam ma adrustham

  ReplyDelete
 6. sri tadepalli raghavanarayana sastry garu books emaina unte...ekkada dorukuthai dayachesi teliyacheyyandi....mahapurushuni gurinchi inka vipulamga telusukovadam ma adrushtam.

  ReplyDelete
 7. Good Morning LalithaSree Garu, I would like to share something personally. Could you please tell me the best way to contact you. Thanks & Regards Lakshmi

  ReplyDelete
 8. Good Morning LalithaSree Garu, I would like to share something personally. Could you please tell me the best way to contact you. Thanks & Regards Lakshmi

  ReplyDelete
  Replies
  1. Sorry for my late reply respected Laxmi Garu. You can call me directly or mail me, whichever is convenient for you. My no. 9972455221
   My mail: lalitha.gorthi@gmail. Com

   Delete
  2. Sorry for my late reply respected Laxmi Garu. You can call me directly or mail me, whichever is convenient for you. My no. 9972455221
   My mail: lalitha.gorthi@gmail. Com

   Delete
 9. Good morning Lalitha garu , can you give me exact address , how to reach this holy place from hyderabad, chnadavolu is not coming in google maps

  ReplyDelete
  Replies
  1. Good morning Raghu garu. We drove there from kakinada while going towards Bangalore. It's near Bapatla. Try searching as "Chandole". Still if you don't get, please give me your number. My husband can guide you definitely.

   Delete
 10. j.vangala@rediffmail.comJuly 30, 2016 at 2:22 AM

  namaskaramulu.today i heard about sri tadepalli sastry garu and luckily saw your blog. i cannot tell you how i felt only that we are blessed to know about such a mahapurusha. and thanks to you and your kindness in sharing your experiences we enjoyed the photos and the story.god bless you

  ReplyDelete
  Replies
  1. Thank you for your blessings and thank god for His blessings.

   Delete
 11. Madam My name is Lakshman..I heard that Sastry Garu written some golden books. If you have any soft copies can you please mail me to g_laxman@yahoo.com
  I am eagerly waiting to read such a great divine books.

  ReplyDelete
 12. Namaste laxman Garu. soryy, I don't have any soft copies, but you can get some books at their place. I will attach the pic of the visiting card I received there which may help you in getting some books or information.

  ReplyDelete
 13. I added the photo in the blog post please refer to that

  ReplyDelete
 14. Thanks for the reply Madam. I came to know that Sastry garu written some books in that i found 1)Enkoka Mata
  2) Sri Lalitha Thrisathi Bhaswarda Deepika

  ReplyDelete
 15. Hello lalithasree mam I want to know that the legend sri tadepali raghava narayana sastry gari house akkada vundha and vala kutumba(family members) akkada vunara...and I heard that there is a temple and gowshala Veda patashala

  ReplyDelete
 16. I am so lucky to know mahapurusha biography and I think there is a bala Tripura sundari devi blessing with me to know about mahapurusha from ur wedsite tqq lalitha sree mam such a humble heart to u.....

  ReplyDelete
  Replies
  1. hello Anirudh garu, yes the house of Sri Raghava narayana Sastry garu and veda patha sala are located near the entrance of the village Chandole. AAyana che pratishtimpabadina bala tripura sundari ammavari temple Tenali lo undi. Thank you

   Delete
 17. This comment has been removed by the author.

  ReplyDelete
 18. Sir,
  Chandole is in Guntur dist
  Near ponnur
  https://www.google.co.in/maps/place/Chandole,+Andhra+Pradesh+522311/@16.0074436,80.6096163,16z/data=!4m5!3m4!1s0x3a4a17730cdfc46f:0xe6e469e1d8c45a09!8m2!3d16.008059!4d80.6132646?hl=en

  ReplyDelete
 19. Lalitha Garu, Thanks for sharing this divine information

  Sairam

  ReplyDelete
 20. Can anybody tell, from where can I get the books written by Tadepalli Raghava Narayana Sastry Garu like "Matswapnah" and "Dattatreya Stotra Antargata Balatripurasundari Suprabhatam or Atma Suprabhatam"

  ReplyDelete
  Replies
  1. chandole lone valla inti dggare dorukutayi.migata chotla ekkada dorukutayo teliyadu

   Delete
 21. please tell me the address of the temple who was constructed by chandolu sastri garu

  ReplyDelete
 22. This comment has been removed by the author.

  ReplyDelete
 23. please tell me the address of the temple which was constructed by chandolu satri garu. please send the address to my mail vasuchi5665@gmail.com

  ReplyDelete
  Replies
  1. i dont know the exact address of the temple, but i know that it is in Tenali.

   Delete
  2. https://www.google.co.in/search?safe=off&biw=1366&bih=613&q=bala+tripura+sundari+temple+tenali&sa=X&ved=0ahUKEwia9OG4-djRAhUIvo8KHbkQBGkQ1QIIcCgC

   Delete
 24. BalaTripurasundari ammavari temple
  Pillalamarri Vari St, Ganganamma Peta, Ramalingeswara Pet, Tenali, Andhra Pradesh 522201

  ReplyDelete
 25. Mee anubhavaalu andharitho panchukuni maaku enno goppa vishayaalu thelsiyachesinandhuku Meeku ma hyudhayapoorvaka kruthagnyathalu!! Maakkuda entho kuthoohalam ga undhi aayana unna choti ni choodalani inka enno vishayalu thelusukovalani, kani aa avakaasam lekapoyinandhuku chinthisthunna samayam lo mee page dhoriki yentho thrupthinichindhi! Aa swami vaaru mimmalni challaga choodugaaka!

  ReplyDelete
  Replies
  1. Chala Santosham Andi, bhagavantudi anugrahaniki krutagnatalu

   Delete
 26. Firstly thanks for the post anna..
  Anna i am a meditator, we do yoga daily.. we usually can feel the vibrancy of any energy spaces like this sastry garu's house..
  And i am also a devi devotee and even we have a energy form of devi in our home which can produce a field of energy and even we can feel her presence sometimes..

  So i heard about this place from other meditator and felt like to visit once.. and even i stay in Bapatla only.. this place is so near to my home.. so i took address guidance through this post and me and my friend meditator successfully visited the place..

  The place was sooo vibrant and I cannot even express it in words.. that was a wonderful experience ever i had in my life.. i feel the devi's presance in every inch of that place.. I cannot forget that experience ever..

  Anyway thank you very much for this post..
  I must visit Tenali temple also soon..

  ReplyDelete
  Replies
  1. Lalitha sree garu.. if you come to visit this place again in future anytime please let me know and come visit our devi in our home too..

   Thank you once again for this post..

   Delete
  2. very happy to know about your experience and thank you so much for your response

   Delete
  3. surya garu this is nagavrdhan from hyderabad. i want to exactly ammavari temple address please. thankq

   Delete
  4. This is in CHANDHOLU.. Guntur district.. near to PONNUR.. after entering Chandholu ask for CHANDHOLU SASTRI garu house.. it is located in the Outskirts of the village.. near to VEDHA PAATASHALA.. it will appear from main road side.. its not much tough to find.. u can ask anyone in the village for address..

   Delete
 27. I did not read all the comments above so please forgive if this is a repetition. Just now my friend says that when chandolu tatagaru was being cremated Sri Tripurasudari devi came out if his body and left upwards from the pyre

  ReplyDelete
 28. very happy and blessed to read about Gurugaru!! What is a good and convenient time to visit the house in Chandole? Please guide , Thank you.

  ReplyDelete
 29. chandolu sastry garu cheppina Manthram telupagalaru sastry garu yea manthram cheppinaro cheppandi

  ReplyDelete
  Replies
  1. You can reach Chandolu and pray Sri Balatripura Sundari amma at the temple and amma gives you what ever you want.
   Here is one YouTube video about Sri Sastry Gau.

   https://youtu.be/HA_XktgYaUU

   Also many more valuable information about Sri Sastry Garu are posted on YouTube by Sri Dr. Tadepally Patanjali garu

   https://www.youtube.com/playlist?list=PLoncLLuY17HzON9Wz_xoq2hl2DvQErdyV

   Jai Guru Dev

   Delete
 30. Thank you for sharing such precious info, Jai Guru Dev

  ReplyDelete
 31. https://www.youtube.com/playlist?list=PLoncLLuY17HzON9Wz_xoq2hl2DvQErdyV

  Jai Guru Dev

  ReplyDelete
 32. I heard about Tadepalli Raghava narayana sastri garu in various pravachanams. His deciples have been guiding humanity so theres no reason to think the old masters are no more. Divine aura is on the mans face. all the posts by well wishers are proof that he is still living amongst us as you good people.

  ReplyDelete
 33. Thank you all for sharing such wonderful information about Brahma Sri Raghavanaraya Sastry garu

  ReplyDelete
 34. I could have an opportunity to listen his speech directly when I was studying in S G V Oriental College ,Timmasamudram

  ReplyDelete
 35. Hi
  Am janaki from hyderabad. ..
  I am also devotee of goddess durga
  From my birth I got black spots on my
  Tong. ..maa durga appeared at vijayawada temples and had spoken to me. .
  Later I known that she was amma. ..
  In 2016 she came to my house in srichakra. I saw her in many forms
  She speaks. .she eat meal. .Some times she cursed me. .my body was changed with amma face. ..whatever I touch any object it turns to amma. ...bye all
  Pl. ..respond. .expecting from you
  Comments. ..regards

  ReplyDelete